Allu Arjun : గోవాలో స్పెషల్ వ్యక్తి కోసం స్వయంగా ఆల్కహాల్ కొన్న అల్లు అర్జున్.. అన్‌స్టాపబుల్ షోలో సీక్రెట్ రివీల్

Allu Arjun bought alcohol himself for a special person in Goa secret revealed in Unstoppable show
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. పుష్ప భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప 2 పై నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేశారు మేకర్స్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో సుకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ నందమూరి నటసింహం బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో కి వచ్చారు. ఇటీవల దీనికి సంబందించిన ప్రోమో కూడా రిలీజ్ చేసారు. గతంలో అల్లు అర్జున్ గోవాలో ఆల్కహాల్ కొన్నట్టు ఓ ఫొటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోని బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో చూపించి.. ఎవరికోసం నువ్వే స్వయంగా వెళ్లి ఆల్కహాల్ కొన్నావు అని బాలయ్య అడిగాడట. దానికి బన్నీ..ఒక స్పెషల్ పర్సన్ కోసం ప్రత్యేకంగా తానే వెళ్లి తెచ్చినట్టు తెలిపారట.
Also Read : Rahul Vijay : హీరోయిన్స్ తో కలిసి అమెరికా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరో..
మరి ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అన్నది తెలియాలంటే నవంబర్ 14 రాత్రి నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న అన్‌స్టాపబుల్ విత్ NBK షో బన్నీ ఎపిసోడ్ చూడాల్సిందే. అంతేకాకుండా బన్నీ ఎవరి కోసం ఆ ఆల్కహాల్ కొన్నారో ఆ వ్యక్తి కూడా రేపటి షోలో రానున్నారట. ఇక ఆ పర్సన్ ఎవరు అని రేపటి షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.