Allu Arjun : అల్లు అర్జున్ కారు టైర్స్‌ని గమనించారా.. వైరల్ అవుతున్న ఫొటోలు..

తన స్టైల్ అఫ్ లివింగ్‌తో ఐకాన్ స్టార్‌ అనిపించుకున్న అల్లు అర్జున్ కారు టైర్స్‌ని గమనించారా..!

Allu Arjun car tyre photos gone viral and pushpa 2 meme videos

Allu Arjun : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన స్టైల్ అఫ్ లివింగ్‌తో యూత్‌ ఐకాన్ అనిపించుకుని.. ఐకాన్ స్టార్‌గా పేరుని సంపాదించుకున్నారు. టాలీవుడ్ యూత్ కి స్టైల్ అనే పదాన్ని పరిచయం చేసింది బన్నీనే అని చెప్పడంలో పెద్ద సందేహ పడనవసరం లేదు అనుకుంట. అల్లు అర్జున్ ధరించే డ్రెస్సులు నుంచి హెయిర్ స్టైల్, ఉపయోగించే వస్తువులు కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి.

అల్లు అర్జున్ తన స్టైల్ అఫ్ లివింగ్‌ స్వయంగా.. దగ్గరుండి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. మరి ప్రతి విషయంలో ప్రత్యేకత చూపించే బన్నీ.. తన కారు విషయంలో మాత్రం ఆ ప్రత్యేకతని ఎందుకు పక్కన పెడతారు చెప్పండి. ఈక్రమంలోనే తన కారు టైర్స్ పై తన సంతకం వచ్చేలా డిజైన్ చేయించుకున్నారు. అల్లు అర్జున్ స్టాంప్ మార్క్ సిగ్నేచర్ ‘AA’ అనే విషయం అందరికి తెలిసిందే.

Also read : YVS Chowdary : మహేష్ బాబు ఇచ్చిన సలహాతోనే.. ధైర్యం చేసి అటుగా అడుగులు వేశాను..

అల్లు అర్జున్ సినిమాలు, బిజినెస్‌లకు ఈ సంతకమే.. లోగో మార్క్ అయ్యింది. ఇప్పుడు ఈ లోగో మార్క్ ని తన కారు టైర్స్ పై వచ్చేలా బన్నీ డిజైన్ చేయించుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇక అక్కడకి వచ్చిన అల్లు అర్జున్ కారుని, టైర్స్ పై ఉన్న AA లోగోని కొందరు అభిమానులు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక పుష్ప 2 షూటింగ్ విషయానికి వస్తే.. గత కొంత కాలంగా మూవీలోని జాతర సీన్ షూటింగ్ చేస్తున్నట్లే చెప్పుకొస్తున్నారు. జాతర బ్యాక్‌డ్రాప్ తో ఒక సాంగ్ అండ్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. మూవీలో ఇదే హైలైట్ కానుదట. దీంతో ఈ సీక్వెన్స్ విషయంలో మూవీ టీం చాలా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నెలలు గడుస్తున్నా, ఇంకా అదే షూట్ చేస్తూ ఉండడంతో.. బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.