AlluArjun offers condolences Rajendraprasads daughter gayatri
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి కన్నుమూసింది. నిన్నఅర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
రాజేంద్ర ప్రసాద్‌ను సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. గాయత్రి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నటకిరిటీని పరామర్శించారు.
Matka Teaser : వరుణ్ తేజ్ ‘మట్కా’ టీజర్.. అదిరిపోయింది
ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రష్మిక మందాన హీరోయిన్‌గా నటిస్తుండగా సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు అభిమానులను అంచనాలను పెంచేశాయి.