Matka Teaser : వ‌రుణ్ తేజ్ ‘మ‌ట్కా’ టీజ‌ర్.. అదిరిపోయింది

జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేసే హీరోల్లో మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ ఒక‌రు.

Matka Teaser : వ‌రుణ్ తేజ్ ‘మ‌ట్కా’ టీజ‌ర్.. అదిరిపోయింది

Varun Tej Matka Teaser out now

Updated On : October 5, 2024 / 3:38 PM IST

Matka Teaser : జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేసే హీరోల్లో మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ ఒక‌రు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న మూవీ ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ లు భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మీనాక్షి చౌదరి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీలో నవీన్ చంద్ర, నోరా ఫతేహి, సలోని కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం న‌వంబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది. అందులో భాగంగా నేడు ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది.

Dhee Sequel : ‘ఢీ’ సీక్వెల్ అందుకే ఆగిపోయింది.. శ్రీను వైట్ల వ్యాఖ్యలు..

ఈ దేశంలో చెలామ‌ణి అయ్యే ప్ర‌తి రూపాయిలో 90 పైస‌లు నూటికి ఒక్క‌డే సంపాదిస్తాడు. మిగ‌తా 10 పైస‌ల గురించి మిగిలిన 99 మంది కొట్టుకుంటారు అనే డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. టీజ‌ర్‌లో వ‌రుణ్ తేజ్ చెప్పిన‌ డైలాగ్‌లు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ఫైట్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.మొత్తంగా టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.