Dhee Sequel : ‘ఢీ’ సీక్వెల్ అందుకే ఆగిపోయింది.. శ్రీను వైట్ల వ్యాఖ్యలు..
తాజాగా శ్రీనువైట్ల ఢీ సీక్వెల్ సినిమా గురించి మాట్లాడారు.

Sreenu Vaitla Comments on Manchu Vishnu Dhee Movie Sequel
Dhee Sequel : శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు, జెనీలియా జంటగా 2007 లో వచ్చిన సినిమా ఢీ. ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. మంచు విష్ణు కెరీర్లో ఈ సినిమా మంచి మైలురాయిగా నిలిచింది. ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ స్క్రిప్ట్స్ తో వరుస హిట్స్ కొట్టిన శ్రీనువైట్ల గత కొన్నాళ్లుగా అడపాదడపా సినిమాలు చేస్తున్నా సరైన విజయం సాధించలేదు.
అయితే గతంలో ఢీ సినిమాకు సీక్వెల్ గా శ్రీనువైట్ల, మంచు విష్ణు కలిసి D @ D (డబల్ డోస్) అనే సినిమాని ప్రకటించారు. కానీ ఆ సినిమా గురించి మళ్ళీ ప్రస్తావనే లేదు. ఆ ఆసినిమా ఆగిపోయిందని అంతా ఫిక్స్ అయిపోయారు. తాజాగా శ్రీనువైట్ల ఢీ సీక్వెల్ సినిమా గురించి మాట్లాడారు.
Also Read : Rocking Rakesh : తండ్రి అయిన జబర్దస్త్ రాకేష్.. పండగ పూట మహాలక్ష్మి పుట్టింది అంటూ ఎమోషనల్ పోస్ట్..
త్వరలో శ్రీనువైట్ల గోపీచంద్ తో తెరకెక్కించిన విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడారు శ్రీను వైట్ల. ఈ క్రమంలో ఢీ సీక్వెల్ పై స్పందించారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ఢీ సినిమాలో శ్రీహరి గారు చేసిన పాత్రని ఎవరూ రీప్లేస్ చేయలేరు. కొన్ని ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనుకున్నాము కానీ ఆయనలా ఎవ్వరూ మెప్పించలేరు. శ్రీహరి గారు ఇప్పుడు లేకపోవడం వల్లే ఆ సినిమా ఆగిపోయింది అని తెలిపారు. ఢీ సినిమాలో శ్రీహరి కీలక పాత్ర పోషించారు. సీరియస్ పాత్రే అయినా దాంతో కూడా ప్రేక్షకులని నవ్వించారు. సినిమాలో శ్రీహరి – విష్ణు కాంబో సీన్స్ అదిరిపోతాయి.