Rocking Rakesh : తండ్రి అయిన జబర్దస్త్ రాకేష్.. పండగ పూట మహాలక్ష్మి పుట్టింది అంటూ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా తాను తండ్రి అయ్యాను అంటూ హాస్పిటల్ నుంచి సుజాత, పాప ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసారు జబర్దస్త్ రాకేష్.

Rocking Rakesh : తండ్రి అయిన జబర్దస్త్ రాకేష్.. పండగ పూట మహాలక్ష్మి పుట్టింది అంటూ ఎమోషనల్ పోస్ట్..

Rocking Rakesh and Jordar Sujatha became Parents Jabardasth Rakesh Shares Emotional Post

Updated On : October 5, 2024 / 2:15 PM IST

Rocking Rakesh – Jordar Sujatha : జబర్దస్త్ తో బాగా పాపులారిటీ తెచ్చుకున్న నటుడు రాకేష్ తాజాగా తండ్రి అయ్యాడు. యాంకర్ జోర్దార్ సుజాత జబర్దస్త్ లోకి వచ్చాక వీరి పరిచయం ప్రేమగా మారి కొన్నాళ్ళు ప్రేమించుకొని గత సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. రాకేష్ – సుజాత జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. కొన్ని నెలల క్రితం రాకేష్ తన భార్య సుజాత ప్రగ్నెంట్ అని తెలిపారు. ఇటీవల సీమంతం ఫోటోలు కూడా షేర్ చేసారు.

తాజాగా తాను తండ్రి అయ్యాను అంటూ హాస్పిటల్ నుంచి సుజాత, పాప ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసారు జబర్దస్త్ రాకేష్.

Also Read : Diya Suriya : దర్శకురాలిగా మారిన సూర్య-జ్యోతిక కూతురు.. డాక్యుమెంటరీతో అవార్డు.. ఫ్యూచర్ డైరెక్టర్..?

రాకేష్ తన పోస్ట్ లో.. ఈ నవరాత్రి పర్వదినాలలో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. హాస్పిటల్లో నేను అనుభవించిన ఆ సంఘటన ఓ అద్భుతం. మా అమ్మని ఎంతో బాధ పెడుతూ ఈ లోకంలోకి వచ్చిన నేను ప్రత్యక్షంగా ఆ బాధను చూస్తూ తండ్రినయ్యాను. ఈ జన్మలో ఏ బాధ నిన్ను దరిచారనివ్వమ్మా. నా బాధలో నా ఆనందంలో సగమైన నా సుజాత ఓ బిడ్డకి తల్లిగా నా కుటుంబానికి మరో అమ్మగా పరిపూర్ణ స్త్రీగా మారిన ఓ అద్భుత క్షణం ఆ దేవుడు ఆశీస్సులతో త్వరలో కోల్కొని నువ్వు షూటింగ్స్ లో బిజీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను సుజాతని మొదటి నుంచి మీ ఆశీస్సులతో పాజిటివ్ ఎనర్జీ తో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఇలానే మీ ఆశీస్సులు మా పాప మీద ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

 

దీంతో రాకేష్ -సుజాత జంటకు నెటిజన్లు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.