Diya Suriya : దర్శకురాలిగా మారిన సూర్య-జ్యోతిక కూతురు.. డాక్యుమెంటరీతో అవార్డు.. ఫ్యూచర్ డైరెక్టర్..?
ఇటీవల సూర్య కూతురు దియా దర్శకురాలిగా తాను తీసిన డాక్యుమెంటరీకు గాను ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది.

Suriya Jyothika Daughter Diya Suriya Winning Awards for her Documentary Leading Light
Diya Suriya : తమిళ్ స్టార్ కపుల్ సూర్య – జ్యోతికకు ఒక కూతురు, కొడుకు అని తెలిసిందే. ప్రస్తుతం కూతురు ముంబైలో చదువుతుందని సమాచారం. ఇటీవల సూర్య కూతురు దియా దర్శకురాలిగా తాను తీసిన డాక్యుమెంటరీకు గాను ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది.
Also Read : Devara : దేవర ప్రీ ప్రొడక్షన్ ఎన్టీఆర్ స్కెచెస్ చూసారా..? ‘దేవర’కు ప్రీ వర్క్ బాగానే చేసుకున్నారుగా..
సినీ పరిశ్రమలో ఉన్న మహిళా లైట్ ఉమెన్స్, గాఫర్స్, సినిమాటోగ్రాఫర్స్.. ఇలా తెరవెనుక హార్డ్ వర్క్ చేసే మహిళా సాంకేతిక నిపుణులతో మాట్లాడిస్తూ ఓ డాక్యుమెంటరీ చేసింది. లీడింగ్ లైట్ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీని తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీకి త్రిలోక ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో దియా సూర్య పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.
దీంతో సూర్య, జ్యోతిక ఈ విషయాన్ని చెప్తూ తమ కూతురు గురించి గర్వంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. సినీ పరిశ్రమలోని మహిళా వర్కర్స్ కోసం తను చేసిన పనిని అభినందిస్తున్నారు. దీంతో ఈ డాక్యుమెంటరీ వైరల్ గా మారింది. పలువురు ఫ్యాన్స్, నెటిజన్లు దియాని అభినందిస్తున్నారు. దీంతో దియా భవిష్యత్తులో డైరెక్టర్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమకు సంబంధించిన కోర్సులు చదువుతుందని అనుకుంటున్నారు. మరి ఫ్యూచర్ లో దియా డైరెక్టర్ అయి తన తల్లి తండ్రిలాగే సినీ పరిశ్రమలో ఎదిగి అందర్నీ మెప్పిస్తుందా చూడాలి.
దియా సూర్య తీసిన లీడింగ్ లైట్ డాక్యుమెంటరీ మీరు కూడా చూసేయండి..