Devara : దేవర ప్రీ ప్రొడక్షన్ ఎన్టీఆర్ స్కెచెస్ చూసారా..? ‘దేవర’కు ప్రీ వర్క్ బాగానే చేసుకున్నారుగా..
విజువల్ డైరెక్టర్ విశ్వనాధ్ సుందరం దేవర సినిమాకు సంబంధించిన కొన్ని ఎన్టీఆర్ స్కెచెస్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Image Credits : Viswanath Sundaram Instagram
Devara : ఎన్టీఆర్ దేవర సినిమా ఇటీవలే థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించి కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది. ఇప్పటికే దేవర సినిమా 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసింది. మూవీ యూనిట్ కూడా సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఇంత భారీ యాక్షన్ సినిమాకు షూట్ కు ముందు ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువగా కష్టపడాలి. దేవరకు కూడా మూవీ టీమ్ బాగానే కష్టపడ్డారు.
సాధారణంగా చాలా సినిమాలకు షూట్ కి వెళ్లేముందు స్కెచ్ బోర్డు చేసుకుంటారు. హీరో, చుట్టూ పాత్రలు, లొకేషన్స్ ఎలా ఉండాలి, ఆయుధాలు ఎలా ఉండాలి అని సినిమా కథ పరంగా స్కెచెస్ గీస్తారు. పెద్ద సినిమాలకు కచ్చితంగా స్కెచ్ బోర్డ్స్ వేస్తారు. తాజాగా దేవర సినిమాకు ప్రీ ప్రొడక్షన్ లో స్కెచెస్, విజువల్స్ గీసిన విజువల్ డైరెక్టర్ విశ్వనాధ్ సుందరం దేవర సినిమాకు సంబంధించిన కొన్ని ఎన్టీఆర్ స్కెచెస్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Iamge Credits : Viswanath Sundaram Instagram
Also Read : Mrunal Thakur – Lochan Thakur : మృణాల్ ఠాకూర్ అక్క లోచన్ ఠాకూర్ గురించి తెలుసా? స్టార్ మేకప్ ఆర్టిస్ట్..
ఈ స్కెచెస్ లో ఎన్టీఆర్.. సముద్రంలో పడవపై నిల్చొని గంభీరంగా చూస్తున్నట్టు ఉన్నాడు. ఈ స్కెచెస్ లో కూడా దేవర పాత్ర అదిరిపోయింది, అనుకున్నట్టే తెరపై చూపించారు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం దేవర ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కి సంబంధించిన ఈ ఎన్టీఆర్ స్కెచెస్ వైరల్ అవుతున్నాయి. ఇవి చూస్తుంటేనే దేవర సినిమాకు ప్రీ ప్రొడక్షన్ కోసం కూడా మూవీ టీమ్ అంతా బాగా కష్టపడినట్టు తెలుస్తుంది.
ఇక ఇంత బాగా ఈ స్కెచెస్ గీసిన విశ్వనాధ్ సుందరంను అభినందిస్తున్నారు నెటిజన్లు. విశ్వనాధ్ గతంలో బాహుబలి, పుష్ప, సలార్, RRR.. ఇలా భారీ సినిమాలకు, చాలా తమిళ్ సినిమాలకు ప్రీ ప్రొడక్షన్ లో విజువల్/ క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేసాడు.