Allu Arjun congratulations to PawanKalyan over his victory in pithapuram
Allu Arjun – PawanKalyan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు విజయ దుందభి మోగిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్ధి పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధి వంగా గీతపై 69,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో జనసైనికుల సంబరాలు మిన్నంటాయి. పవన్ విజయం పై సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పవన్‌కు అభినందనలు తెలియజేశారు. ‘అద్భుత విజయం సాధించిన పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక అభినందనలు. ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకిత భావం, నిబద్ధత ఎల్లప్పుడూ హృదయాన్ని హత్తుకునేవి. మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు.’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
Pawan Kalyan Wife : పవన్ గెలుపు.. వీర తిలకం పెట్టి హారతి ఇచ్చిన భార్య.. పక్కనే తనయుడు అకిరా..
Heartiest congratulations to @PawanKalyan garu on this tremendous victory . Your hardwork, dedication and commitment to serve the people for years has always been heart touching . Best wishes for your new journey to serve the people .
— Allu Arjun (@alluarjun) June 4, 2024