Allu Arjun Daughter Allu Arha tells Telugu Poem in Pushpa 2 Pre Release Event Watch Here
Allu Arha : తాజాగా నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ తో పాటు అల్లు అయాన్, అల్లు అర్హ కూడా వచ్చారు. వీరిద్దరూ కూడా స్టేజి ఎక్కి క్యూట్ గా మాట్లాడారు.
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ మాట్లాడుతూ… నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? మీకు అందరికీ పుష్ప చాలా బాగుంటాది. తగ్గేదెలే అని అన్నాడు. ఇక అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం అని చెప్పి ఇటీవల ఆహా షోలో చెప్పిన తెలుగు పద్యం.. ‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ..’ని మళ్ళీ స్టేజిపై అంతా మంది ముందు ఈజీగా చెప్పేసింది. మీరు కూడా అర్హ ఎంత క్యూట్ గా పద్యం చెప్పిందో చూసేయండి..
అయితే అన్ని వేల మంది ముందు కూడా అర్హ ఈజీగా తెలుగు పద్యం చెప్పడంతో ఆశ్చర్యపోతూనే అర్హని అభినందిస్తున్నారు.