×
Ad

Allu Arjun: పుష్ప 2 మరువలేని ప్రయాణం.. గొప్ప గౌరవం.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప 2 ఏ రేంజ్ లో సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే కనీవినీ ఎరుగని రికార్డులను క్రియేట్ చేసింది.

Allu Arjun emotional post on Pushpa 2 completed one year of release

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 ఏ రేంజ్ లో సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే కనీవినీ ఎరుగని రికార్డులను క్రియేట్ చేసింది. పుష్ప లాంటి సూపర్ హిట్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించింది. కథ, ఎమోషన్, సాంగ్స్, యాక్షన్ ఇలా ప్రతీ విషయంలో నెంబర్ వన్ గా నిలిచింది ఈ సినిమా. ఇక సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. పుష్ప రాజ్ గా తన విశ్వరూపాన్ని చూపించాడు అల్లు అర్జున్(Allu Arjun). సినిమాలో తన మాస్ యాటిట్యూడ్ కి ఆడియన్స్ మెంటలెక్కిపోయారు.

Prabhas New Look: ప్రభాస్ కొత్త లుక్ అదిరింది.. ఈ ఫోటోలు మీరు చూశారా..

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాదించి ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2. అలా అల్లు అర్జున్, సుకుమార్ కెరీర్ లో చాలా స్పెషల్ సినిమాగా నిలిచింది పుష్ప 2 మూవీ. తాజాగా ఈ సినిమా విడుదలై ఏడాది గడుస్తున్నా వేళ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు హీరో అల్లు అర్జున్.”పుష్ప అనేది ఐదేళ్లపాటు సాగిన మరువలేని ప్రయాణం. ఈ సినిమాపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం మాకు సరికొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సినిమాను ఇత అద్భుతంగా, ప్రత్యేకంగా మార్చిన ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఇలాంటి టీంతో పనిచేయడం ఎప్పుడు గొప్ప గౌరవంగానే ఉంటుంది” అంటూ రాసుకొచ్చాడు అల్లు అర్జున్.

దీంతో ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.