Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ బాగానే ప్లాన్ చేసాడుగా.. ఏకంగా మూడు నుంచి అయిదు లక్షలు..
ఈ ఫ్యాన్స్ మీట్ సందర్భంగా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. (Allu Arjun)
- Saketh U
- Published on- July 29, 2026 / 09:16 AM IST
Allu Arjun
Allu Arjun : పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ నిన్న తన ఫ్యాన్స్ ని మీట్ అయ్యారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరగగా అల్లు అర్జున్ హాజరయి ఫ్యాన్స్ తో మాట్లాడి, పలువురికి ఫోటోలు ఇచ్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ట్రోల్స్ పై మాట్లాడిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ ఫ్యాన్స్ మీట్ సందర్భంగా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తన ఆర్గనైజేషన్ లో నడుస్తున్న ఈ ఫ్యాన్ మీట్ లో సభ్యులుగా ఉన్నవారందరికి అల్లు అర్జున్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించారట. రాష్ట్ర స్థాయి సభ్యులకు 5 లక్షలకు గాను, జిల్లా స్థాయి సభ్యులకు 3 లక్షలకు గాను ఇన్సూరెన్స్ చేయించారు అల్లు అర్జున్. దీనికి సంబంధించిన కార్డ్స్ ని కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులకు అందించారు. ఈ కార్డులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : Romanchakam : పవన్ కళ్యాణ్ బర్త్ డేకి.. లవ్ సినిమా రిలీజ్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ..
నిన్న జరిగిన ఫ్యాన్ మీట్ కి దాదాపు వెయ్యి మంది వరకు హాజరయ్యారు. గత కొన్నాళ్లుగా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని ఒక పద్ధతిగా ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ తన ఇమేజ్ ని మరింత పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.
