Romanchakam : పవన్ కళ్యాణ్ బర్త్ డేకి.. లవ్ సినిమా రిలీజ్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ..
ఇప్పటికే రోమాంచకం సినిమా నుంచి ఓ గ్లింప్స్, ఓ సాంగ్ రిలీజ్ చేసి మెప్పించారు. (Romanchakam)
Romanchakam
Romanchakam : ఓ పక్క భారీ సినిమాలు డైరెక్ట్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే తన నిర్మాణంలో ఓ చిన్న సినిమాని ప్రకటించారు. సందీప్ రెడ్డి వంగ నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై రోమాంచకం అనే లవ్ జానర్ సినిమాని ప్రకటించాడు. మేము ఫేమస్, గోదారి గట్టు పైన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న యువ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా, 8 వసంతాలు ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో నేడు ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : NTR : పాపం ఎన్టీఆర్ పరిస్థితి.. ఓ పక్క వివాదాలు .. ఓ పక్క గాయాలు.. ఓ పక్క డ్రాగన్ వాయిదాలు..
ఇప్పటికే రోమాంచకం సినిమా నుంచి ఓ గ్లింప్స్, ఓ సాంగ్ రిలీజ్ చేసి మెప్పించారు. ఇదేదో క్యూట్ లవ్ స్టోరీగా ఉండబోతుందని అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 కాగా ఆ రోజు ప్రీమియర్స్ వేసి సెప్టెంబర్ 3 నుంచి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాతో మరోసారి సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ ప్రేక్షకులను మెప్పిస్తారని తెలుస్తుంది.

