Allu Arjun : మాల్దీవుల్లో బన్నీ ఫ్యామిలీ, ఫొటోలు వైరల్

కుటుంబసభ్యులతో కలిసి..బన్నీ...మాల్దీవులకు చెక్కేశారు. తన కొడుకు అయాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్ కోసం మాల్దీవులు వెళ్లారు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశారు.

allu-arjun-famil

Maldives : సినిమాలతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే హీరోలు..కాస్తా విరామం దొరికితే..ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. విదేశాలకు వెళ్లి..అక్కడ కుటుంబసభ్యులతో సరదగా గడుపుతుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫ్యామిలతో గడపడానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. విరామం దొరకగానే..కుటుంబసభ్యులతో కలిసి..బన్నీ…మాల్దీవులకు చెక్కేశారు. తన కొడుకు అయాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్ కోసం మాల్దీవులు వెళ్లారు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశారు.

బన్నీ సతీమణి స్నేహారెడ్డి కూడా అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా..కుటుంబంతో ఉన్న ఫొటోలను స్నేహారెడ్డి సోషల్ మీడియా ద్వారా పోస్టు చేశారు. తన లేడీ గ్యాంగ్‌తో కలిసి దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. వీటికి సిస్టర్‌ స్క్వాడ్‌ అని క్యాప్షన్‌ జోడించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే…ఆయన నటిస్తున్న లెటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప’ ఆగస్టు 13న రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో మలయాల స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 07వ తేదీ సాయంత్రం 6.12 గంటలకు పుష్పరాజ్ గా బన్నీని ప్రజలకు పరిచయం చేయనున్నట్లు ఇటీవలే చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే.