Allu Arjun heroine Bhanushree Mehra brother nandu no more
Bhanushree Mehra : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో భానుశ్రీ మెహ్రా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ తనకి గుర్తింపు మాత్రం పెద్దగా దక్కలేదు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుంది.
అయితే ఈ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు నందు మెహ్రా అతి చిన్నవయసులోనే కన్ను మూసారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది. ఇక భానుశ్రీ మెహ్రా సోదరుడు నందు మరణించి ఏడు రోజులు అవుతుంది. ఈ సందర్బంగా తన సోదరుడిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యింది నటి. తన సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
Also Read : Bigg Boss : తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 నుండి 8 వరకు అన్ని సీజన్స్ విజేతలు వీళ్ళే..
ఆమె సోషల్ మీడియాలో ఇలా పేర్కొంది. ” నిన్ను కోల్పోయి 7 రోజులు నందు, ఇది నిజంగా చెడ్డ కలలా ఉంది. ఇది అసలు ఎలా నిజం అవుతుంది? ఎలా ? నేను దీన్ని ఒప్పుకోలేను. నువ్వు మా జీవితాలకు వెలుగు, ఈ కుటుంబానికి గుండె , ఇప్పుడు నువ్వు లేకుండా ప్రతీది చాలా శూన్యంగా ఉంది. నిన్ను పోగొట్టుకున్న బాధ నా జీవితాంతం ఉంటుంది. అందరూ నిన్ను ప్రేమించేవారు. నువ్వు మాతో ఉన్న ప్రతీ క్షణం అద్భుతం. ప్రతి చిన్న విషయం నాకు నిన్ను గుర్తుచేస్తుంది. నీ నవ్వు, నీ జోకులు, ప్రతి ఒక్కరినీ నువ్వు ఆనందపరిచే విధానం అన్ని మిస్ అవుతున్నాం. నువ్వు మా జీవితంలో ఉన్నందున మాత్రమే ఈ ఇల్లు, ఈ జీవితం సంపూర్ణంగా అనిపించింది. కానీ ఇప్పుడు అలా లేదు” అని తన సోదరుడితో ఉన్న పలు ఫోటోలను షేర్ చేసింది.