Bigg Boss : తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 నుండి 8 వరకు అన్ని సీజన్స్ విజేతలు వీళ్ళే..
సీజన్ 8 కంటే ముందు జరిగిన గత 7 సీజన్ ల విన్నర్స్ ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

winners of all seasons of Telugu Bigg Boss season 1 to 8
Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే నిన్న భారీ ఎత్తున జరిగింది. ఇప్పటికే ఏడు సీజన్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ నిన్నటితో సీజన్ 8ని కూడా పూర్తి చేసుకుంది. ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచాడు. చివరి వరకు గౌతమ్, నిఖిల్ ఇద్దరూ ఉండడంతో ఇద్దరిలో విన్నర్ ఎవరవుతారన్న ఆసక్తి ఉన్నప్పటికీ నిఖిల్ విన్నర్ అవుతాడని అందరూ ఎపుడో ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే గౌతమ్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చాడు. వైల్డ్ కార్డ్స్ కి విన్నర్ అయ్యే అవకాశం ఉండదు. అందుకే ముందు నుండి నిఖిల్ ఆట తీరు చూసి తనే విన్నర్ అని ఫిక్స్ అయ్యారు. ఇక సీజన్ 8 గ్రాండ్ ఫినాలే కి చీఫ్ గెస్ట్ గా విన్నర్ కి ట్రోఫీ అందించడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు.
బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ నిలవగా.. సీజన్ 8 కంటే ముందు జరిగిన గత 7 సీజన్ ల విన్నర్స్ ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read : Mohan Babu : మంచు కుటుంబం పై 3 FIR లు.. ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు..
అసలు బిగ్ బాస్ 2017లో ప్రారంభమైంది. మొదటి సీజన్ ను టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. రెండవ సీజన్ ను 2018లో నాని హోస్ట్ చేసిన తర్వాత 2019 నుండి 2024 వరకు నాగార్జున విజయవంతంగా ఇప్పటివరకు కొనసాగుతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 1
బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా నటుడు శివ బాలాజీ నిలిచారు. శివ బాలాజీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కాస్త సినిమాలకి బ్రేక్ ఇచ్చాడు.
బిగ్ బాస్ సీజన్ 2
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ గా కౌశల్ నిలిచాడు. ఈయన కూడా యాక్టర్. పలు సినిమాల్లో నటించిన ఆయన షోస్ కూడా చేశారు. అలా బిగ్ బాస్ కి వెళ్లి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
బిగ్ బాస్ సీజన్ 3
ఈ సీజన్ విన్నర్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఇక ఈయన గురించి తెలిసిందే. టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ముందు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ తన కెరీర్ ప్రభించిన ఈయన ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో పాడే ఛాన్స్ అందుకుంటున్నాడు.
బిగ్ బాస్ సీజన్ 4
ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. ఇక నటుడు అభిజిత్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసాడు. అనంతరం బిగ్ బాస్ కి వెళ్లి విన్నర్ గా నిలిచాడు.
బిగ్ బాస్ సీజన్ 5
సీజన్ 5 విన్నర్ గా వీజే సన్నీ కప్పు గెలుచుకున్నాడు. ఈయన పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. అలాగే కళ్యాణ వైభోగం వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించారు. ఈ సీరియల్ తోనే ఆయనకి బిగ్ బాస్ అవకాశం వచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 6
ఈ సీజన్ కి పాపులర్ సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ అయిన రేవంత్ ఎన్నో పాటలు పాడి, ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నాడు.
బిగ్ బాస్ సీజన్ 7
ఈ సీజన్ కి విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఈయన ఒక సాధారణ వ్యక్తి. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే రైతు. అలాంటి ఒక రైతు బిగ్ బాస్ వరకు వచ్చి విన్నర్ గా నిలిచాడు.