Allu Ayaan – Arha : క్రిస్మస్ కేక్ రెడీ చేసిన అల్లు అయాన్, అర్హ.. వీడియో చూశారా..?

అల్లు వారసులు అయాన్, అర్హ అమ్మ స్నేహారెడ్డితో కలిసి క్రిస్మస్ కేక్ ప్రిపేర్ చేశారు. ఆ వీడియో వైపు ఓ లుక్ వేసేయండి.

Allu Arjun kids Ayaan Arha making christmas cake video viral

Allu Ayaan – Arha : అల్లు వారసులు తమ అల్లరి వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా ఈ ఇద్దరు కలిసి క్రిస్మస్ కేక్ రెడీ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నిన్న క్రిస్మస్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్.. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే అల్లు స్నేహారెడ్డి ఒక వీడియోని పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో అల్లు వారసులు క్రిస్మస్ కేక్ ని సిద్ధం చేస్తూ కనిపిస్తున్నారు. అమ్మ స్నేహారెడ్డితో కలిసి అయాన్, అర్హ.. చాక్లెట్ కేక్ ని ప్రిపేర్ చేశారు. ఇక ఈ వీడియోలో అయాన్ ఇంగ్లీష్ లోనే ఎక్కువ మాట్లాడుతూ కనిపించాడు. కానీ అర్హ మాత్రం తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఆకట్టుకుంది. మరి అల్లు వారసులు ప్రిపేర్ చేసిన ఆ క్రిస్మస్ కేక్ వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

Also read : Kotha Rangula Prapancham Trailer : పృథ్వీ కోసం పవర్ స్టార్.. కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్..

ఈ వీడియోతో పాటు స్నేహారెడ్డి.. మెగా కజిన్స్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్న క్రిస్మస్ సెలబ్రేషన్ ఫోటోలను కూడా షేర్ చేశారు. ఆ ఫొటోలో మెగా అండ్ అల్లు ఫ్యామిలీ కజిన్స్ అంతా కలిసి కనిపించడంతో అభిమానులు దిల్ ఖుషీ అవుతుంది. ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన మరికొన్ని పిక్స్ ని కూడా మెగా ఫ్యామిలీ మెంబెర్స్ షేర్ చేశారు. అయితే ఆ అన్ని ఫొటోల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.