Kotha Rangula Prapancham Trailer : పృథ్వీ కోసం పవర్ స్టార్.. కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్..

30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన కొత్త రంగుల ప్రపంచం మూవీ ట్రైలర్ ని పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు.

Kotha Rangula Prapancham Trailer : పృథ్వీ కోసం పవర్ స్టార్.. కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్..

Prudhviraj Kotha Rangula Prapamcham Trailer released by Pawan Kalyan

Updated On : December 26, 2023 / 5:05 PM IST

Kotha Rangula Prapancham Trailer : 30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్.. హాస్య నటుడిగా, ప్రతినాయకుడిగా ఇన్నాళ్లు అలరిస్తూ వచ్చారు. ఇప్పుడు దర్శకుడిగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన కూతురు శ్రీలు హీరోయిన్ గా నటిస్తున్నారు. క్రాంతి కృష్ణ హీరోగా, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తూనే ఈ చిత్రాన్ని తెరకెక్కిచారు.

నేడు ఈ మూవీ ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ కి తగ్గట్టే ట్రైలర్ లో చాలా రంగులు కనిపించాయి. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని హార్రర్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ మూవీ టీంకి తన విషెస్ తెలియజేశారు. మరి ఆ కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.

Also read : Dunki Collections : ఎట్టకేలకు కలెక్షన్స్ అనౌన్స్ చేసిన డంకీ.. ఐదు రోజులు ఎంత కలెక్షన్స్ అంటే..