Allu Arjun : క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ఫిలిం టీజర్ రిలీజ్..
క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ఫిలింకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Allu Arjun Krish Jagarlamudi film video gone viral in social media
Allu Arjun : ఈరోజు (సెప్టెంబర్ 28) మార్నింగ్ అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక న్యూస్ బయటకి వచ్చింది. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) తో బన్నీ ఒక సినిమా చేయబోతున్నాడంటూ ఒక పోస్టర్ వైరల్ అయ్యింది. ‘కబీ అప్నే, కబీ సప్నే’ టైటిల్ తో ఉన్న ఆ మూవీని క్రిష్ డైరెక్ట్ చేయబోతున్నాడంటూ ఉంది. ఇక దీనిని చూసిన నెటిజెన్స్లో.. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రాబోతోందా..? అనే సందేహం మొదలైంది. తాజాగా ఒక వీడియో కూడా బయటకి వచ్చింది.
Chandramukhi 2 Review : చంద్రముఖి 2 రివ్యూ.. ఆల్రెడీ చూసిన సినిమానే మళ్ళీ చూపించారుగా..
ఆ వీడియో లో ఒక బస్ స్టేషన్, పాసెంజర్స్, అల్లు అర్జున్ మధ్య కొన్ని సన్నివేశాలు చూపించారు. చూస్తుంటే ఏదో యాడ్ షూట్ అని తెలుస్తుంది. గతంలో అల్లు అర్జున్ ‘రెడ్ బస్’కి ఒక యాడ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆ యాడ్ కి సంబంధించిన వీడియో అని తెలుస్తుంది. ఇక ఈ యాడ్ ని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నట్లు ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వీడియో వైపు ఒకసారి మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
Bhagavanth Kesari : భగవంత్ కేసరి జర్నీ వీడియో రిలీజ్.. బాలయ్య మాస్ డైలాగ్..
#update …ఇంట్రస్టింగ్ pic.twitter.com/Z40LjEOEOU
— devipriya (@sairaaj44) September 28, 2023
ఇక అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫోటోలు లండన్ లోనివి అని సమాచారం. ఇటీవల లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఆ విగ్రహం కోసం కొలతలు ఇవ్వడానికి అల్లు అర్జున్ అక్కడికి వెళ్తాడు అంటూ కూడా వినిపించింది. ఇప్పుడు బన్నీ లండన్ లో ఉన్నాడని తెలియడంతో.. ఆ విగ్రహం కోసం కొలతలు ఇవ్వడానికి వెళ్లి ఉంటాడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Stylish Starrrr @alluarjun ??#AlluArjun • #Pushpa2TheRule pic.twitter.com/nx6yUQyiyr
— ICON vijju™ (@bunnyboy32) September 28, 2023