Allu Arjun : అల్లు అర్జున్‌ను ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే రాత్రంతా జైలులో ఉంచారా?

అల్లు అర్జున్ త‌రుపున న్యాయ‌వాది అశోక్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Allu Arjun : అల్లు అర్జున్‌ను ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే రాత్రంతా జైలులో ఉంచారా?

Allu Arjun lawyer criticised Hyderabad jail authorities

Updated On : December 14, 2024 / 10:14 AM IST

శుక్ర‌వారం సాయంత్ర‌మే తెలంగాణ హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసినా జైలు నుంచి అల్లు అర్జున్ విడుద‌ల పై రాత్రి వ‌ర‌కు స‌స్పెన్స్ కొన‌సాగింది. బెయిల్ ప‌త్రాలు అందే విష‌యంలో జాప్యం జ‌ర‌గ‌డంతో రాత్రంతా అల్లు అర్జున్ జైలులోనే ఉండాల్సి వ‌చ్చింది. బెయిల్ ప‌త్రాలు జైలు సూప‌రింటెండ్‌కు అంద‌జేయ‌డంతో ఆ వెంట‌నే విడుద‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు పోలీసులు. అలాగే రూ.50వేల పూచీక‌త్తును జైలు సూప‌రింటెండెట్‌కు స‌మ‌ర్పించారు అల్లు అర్జున్ త‌రుపు న్యాయ‌వాదులు. ఎట్ట‌కేల‌కు శ‌నివారం ఉద‌యం విడుద‌ల అయ్యారు అల్లు అర్జున్‌.

చంచ‌ల్‌గూడ జైలు వ‌ద్ద అప్ప‌టికే భారీ సంఖ్య‌లో అభిమానులు, సినీ ప్ర‌ముఖులు చేరుకోవ‌డంతో బ‌న్నీని వెనుక గేటు నుంచి బ‌య‌ట‌కు పంపించారు పోలీసులు. త‌న తండ్రితో క‌లిసి గీతా ఆర్ట్స్‌కు వెళ్లిన బ‌న్నీ, ఆత‌రువాత త‌న నివాసానికి చేరుకున్నారు.

Allu Arjun : అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురైన కుటుంబ స‌భ్యులు..

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ త‌రుపున న్యాయ‌వాది అశోక్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన కాపీల‌ను జైలు అధికారుల‌కు ముందే అంద‌జేశామ‌న్నారు. అయిన‌ప్ప‌టికి ఎందుకు విడుద‌ల చేయ‌లేదో తెలియ‌డం లేద‌న్నారు. ఈ విష‌యంలో మ‌రోసారి న్యాయ‌ప‌రంగా ముందుకు వెలుతామ‌ని చెప్పారు. మ‌ళ్లీ హైకోర్టును ఆశ్ర‌యిస్తామ‌న్నారు.

‘అల్లు అర్జున్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని కోర్టు ఆదేశించింది. రాత్రంత్రా ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే జైల్లో ఉంచారు. దీనిపై ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాలి. బెయిల్ వ‌చ్చినా విడుద‌ల ఆల‌స్యం చేయ‌డం కోర్టు ధిక్క‌ర‌ణే. ఈ అంశం పై న్యాయ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. పోలీసుల‌పై కోర్టు ధిక్క‌ర‌ణ కేసు వేస్తాం.’ అని అశోక్ రెడ్డి తెలిపారు.