Allu Arjun : అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ఐకాన్ స్టార్ మీటింగ్.. ఎందుకో?

తాజాగా ఈ డైరెక్టర్ అల్లు అర్జున్ ని మీట్ అయ్యాడని సమాచారం. సందీప్ ఇదివరకు ఒకసారి అల్లు అర్జున్ ను మీట్ అయినపుడే ఈ ఇద్దరి కాంబోలో మూవీ రాబోతున్నట్టు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ దానిపై...........

Allu Arjun Meeting With Director Sandeep Vanga

Allu Arjun :  అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ప్రజెంట్ ఈ డైరెక్టర్ యానిమల్ అనే హిందీ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ప్రభాస్ తో ‘స్పిరిట్’ లైన్ లో ఉంది. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ ను షేక్ చేసి దాని ఎఫెక్ట్ తో రెండు హిందీ సినిమాలు పట్టేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బాలీవుడ్ లోనూ దుమ్మురేపడంతో రణబీర్ కపూర్ తో యానిమల్ చేసే బంపర్ ఆఫర్ కొట్టేశాడు.

యానిమల్ మూవీ కంప్లీట్ అయ్యాకా సందీప్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీ తెరకెక్కించనున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ అల్లు అర్జున్ ని మీట్ అయ్యాడని సమాచారం. సందీప్ ఇదివరకు ఒకసారి అల్లు అర్జున్ ను మీట్ అయినపుడే ఈ ఇద్దరి కాంబోలో మూవీ రాబోతున్నట్టు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ దానిపై ఎలాంటి వార్తలు రాలేదు. ఈ సారి కూడా ఈ ఇద్దరి మీటింగ్ మరో సారి వార్తల్లో నిలుస్తోంది.

Salman Khan : సల్మాన్ ఖాన్‌కి వెంకీ మామ బర్త్ డే విషెస్.. వైరల్ అవుతున్న ఫోటో!

ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ లో ఈ ఇద్దరూ కలిశారు. మొదట పలకరించుకున్న తర్వాత కాసేపు ఇద్దరూ పక్కకి వెళ్లి కూర్చొని మాట్లాడుకున్నారు కాసేపు. దీంతో వీరిద్దరూ కలిసి ముచ్చటించుకొనే పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరి కలయికలో సినిమా ఉంటుందా అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఒకవేళ వీరి కాంబోలో మూవీ ఓకే అయినప్పటికీ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా టైమ్ పడుతుంది. సందీప్ యానిమల్ ను కంప్లీట్ చేసి ప్రభాస్ తో సినిమా చేయాలి. దానికి చాలా టైమ్ పడుతుంది. మరో పక్క బన్నీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ ఇద్దరి కమిట్మెంట్స్ ఇప్పట్లో కంప్లీట్ కావని అర్దమవుతోంది. మరి ఈ ఇద్దరి మీటింగ్ వెనుక సీక్రెట్ ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు.