Allu Arjun : సంజయ్‌లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సమావేశం.. సినిమా కోసమేనా??
సోమవారం అల్లు అర్జున్ ముంబయిలో సంజయ్‌లీలా భన్సాలీ కార్యాలయానికి వెళ్లారు. భన్సాలీ కార్యాలయంలోకి వెళుతున్న అల్లు అర్జున్ వీడియో సామాజిక వర్గాల్లో బాగా వైరల్ అయింది. వీరిద్దరి......

Sanjay Leela Bhansali
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే ‘పుష్ప’ సినిమాతో భారీ విజయం సాధించి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమా ముందు వరకు బన్నీకి కేవలం తెలుగు, కేరళ రాష్ట్రాలలోని మార్కెట్ ఉండేది. కానీ ‘పుష్ప’ సినిమా తర్వాత బన్నీకి పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ఏర్పడింది. దీంతో ఇకపై వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తీయాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాని తర్వాత బోయపాటితో ఒక సినిమా ఉంది.
అయితే తాజాగా అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీతో సమావేశం అయ్యారు. సంజయ్‌లీలా భన్సాలీ ఇటీవలే అలియా భట్ మెయిన్ లీడ్ లో వచ్చిన ‘గంగూభాయ్ కతియవాడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా సౌత్ లో అంత ప్రభావం చూపకపోయినా నార్త్ లో మాత్రం మంచి విజయం సాధించింది.
BiggBoss Non Stop : ఈ సారి బిగ్‌బాస్ విన్నర్ ఆమెనే.. కౌశల్ జోస్యం..
నిన్న సోమవారం అల్లు అర్జున్ ముంబయిలో సంజయ్‌లీలా భన్సాలీ కార్యాలయానికి వెళ్లారు. భన్సాలీ కార్యాలయంలోకి వెళుతున్న అల్లు అర్జున్ వీడియో సామాజిక వర్గాల్లో బాగా వైరల్ అయింది. వీరిద్దరి మధ్య చాలాసేపు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడం కోసమే సమావేశమయ్యారా? లేక ఇంకేదైనా కారణాలతో కలిశారా అని ఆరా తీస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్ లో బాగా పాపులారిటీ సాధించాడు బన్నీ, ఇలాంటి సమయంలో సంజయ్‌లీలా భన్సాలీని కలవడంతో అందరిలో ఆసక్తి పెరుగుతుంది. అల్లు అర్జున్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా అని అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే నిజమైతే అల్లు అర్జున్ మరో రేంజ్ కి వెళ్ళినట్టే. బన్నీ అభిమానులు తమ హీరో బాలీవుడ్ లో కూడా సినిమా చేయాలని అనుకుంటున్నారు.