Allu Arjun Mother : బాలయ్య అన్‌స్టాప‌బుల్ షోలో అల్లు అర్జున్ తల్లి కూడా.. బన్నీ గురించి ఏం చెప్పింది..?

నాలుగో ఎపిసోడ్ కి అన్‌స్టాప‌బుల్ లో అల్లు అర్జున్ వచ్చి సందడి చేసాడు. అల్లు అర్జున్ తో పాటు అతని తల్లి కూడా వచ్చారు.

Allu Arjun Mother came to Balakrishna Aha Unstoppable Show Promo Watch Here

Allu Arjun Mother : ఆహా ఓటీటీలో బాలయ్య అన్‌స్టాప‌బుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ రాగా తాజాగా నాలుగో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. నాలుగో ఎపిసోడ్ కి అన్‌స్టాప‌బుల్ లో అల్లు అర్జున్ వచ్చి సందడి చేసాడు.

అల్లు అర్జున్ తో పాటు అతని తల్లి కూడా వచ్చారు. ఈ క్రమంలో బాలయ్య అల్లు అర్జున్ తల్లి నిర్మలకు.. అరవింద్ గారి సతీమణి, మా బెజవాడ ఆడపడుచు, మా రామలింగయ్య గారి కోడలు నిర్మల గారు అంటూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. బాలకృష్ణ చిన్నప్పుడు ఒక్కసారైనా బన్నీని కొట్టారా అని అడిగితే బన్నీ.. ఒక్కసారైనా కొట్టారా అని కాదు దేంతో కొట్టారు అని అడగాలి. అన్ని వెపన్స్ తో కొట్టారు అని చెప్పాడు. మరి ఏ వెపన్ తో మారావు అంటే స్నేహ అనే వెపన్ తో మారాను అని సరదాగా సమాధానమిచ్చాడు అల్లు అర్జున్.

Also Read : Chiranjeevi – Kiran Abbavaram : ఇది కదా సక్సెస్ అంటే.. ‘క’ హిట్ తో కిరణ్ ని పిలిచి మరీ అభినందించిన మెగాస్టార్..

అలాగే.. అల్లు అర్జున్ డల్ గా ఉన్నప్పుడు మీరెళ్ళి ఓదార్చారా అని బాలకృష్ణ అల్లు అర్జున్ తల్లిని అడిగారు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. ఈ ఎపిసోడ్ నవంబర్ 15న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.