Allu Arjun Movie Pushpa Clean Sweep the Filmfare Awards
Allu Arjun: తాజాగా 67వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకలు ఆదివారం సాయంత్రం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి సౌత్ సినీ ప్రముఖులు విచ్చేసి మెరిపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలలో 2020, 2021 మధ్య వచ్చిన సినిమాలకి ఈ అవార్డులని ప్రదానం చేశారు.
Allu Arjun : నేను దేనికి పనికిరాని అనుకోని 10 లక్షలు ఇచ్చారు మా తాత..
ఈ అవార్డుల పురస్కారాల్లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’తో పాటు ‘అలా వైకుంఠపురంలో’ సినిమాలకు అవార్డుల పంట పండింది. ‘అలా వైకుంఠపురంలో’ సినిమాకు గాను మురళీ శర్మ, టబు, శేఖర్ మాస్టర్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా “పుష్ప ది రైజ్” అవార్డును అందుకుంది.
అలాగే అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, సింగర్స్ సిద్ శ్రీరామ్ అండ్ ఇంద్రవతి చౌహన్, కెమెరా మ్యాన్ మీరోస్లా కూబా బ్రజక్.. పుష్ప సినిమాకు గాను అవార్డులు అందుకున్నారు. దీంతో క్లీన్ స్వీప్ చేశామంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది.
Allu Arjun Movie Pushpa Clean Sweep the Filmfare Awards