Allu Arjun – NTR : మెగా సెలబ్రేషన్స్‌కి అల్లు అర్జున్.. నందమూరి బ్రదర్స్ స్పెషల్ విషెస్..

మెగా సెలబ్రేషన్స్‌కి అల్లు అర్జున్ ప్రయాణం. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నందమూరి బ్రదర్స్ స్పెషల్ ట్వీట్స్.

Allu Arjun off to mega sankranti celebrations and NTR festival wishes tweet

Allu Arjun – NTR : పండుగ అయినా, పార్టీ అయినా కుటుంబమంతా కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొనే మెగా ఫ్యామిలీ.. ఇప్పుడు సంక్రాంతి పండుగని కూడా అదే విధంగా జరుపుకుంటున్నారు. అయితే మెగా ఫ్యామిలీకి ఈ సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సంక్రాంతికి కొత్త మనవరాలు, కొత్త కోడలు మెగా ఇంట అడుగు పెట్టారు. ఇక ఈ మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ కి బెంగళూరు ఫార్మ్ హౌస్ విడిది అయ్యింది.

ఆల్రెడీ మెగా ఫ్యామిలీ అక్కడికి చేరుకొని పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా మెగా హీరోలంతా ఫ్యామిలీతో ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కడి విశేషాలన్నిటిని మెగా వారి పెద్ద కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెడుతూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఆ ఫొటోల్లో అల్లు అర్జున్ పిక్స్ కనిపించకపోవడంతో అల్లు ఫ్యాన్స్ డల్ అయ్యారు.

Also read : Mega Family : మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ చూశారా..? కొత్త కోడలి సున్నుండలు తయారీ..

అయితే అల్లు అర్జున్ ఈరోజే అక్కడికి బయలుదేరారు. ఈరోజు ఉదయం అల్లు అర్జున్, స్నేహారెడ్డి బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద అల్లు కపుల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పండుగ మూడు రోజులు మెగా ఫ్యామిలీ అంతా అక్కడ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేయనున్నారు. అల్లు అర్జున్ అభిమానులు హ్యాపీ అయ్యారు అనుకుంటే పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. పవన్ ఒక్కడే మిస్ అవుతున్నారని ఫీల్ అవుతున్నారు.

ఇది ఇలా ఉంటే, పండగ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీస్ అభిమానులకు ఫెస్టివల్ విషెస్ తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ స్పెషల్ ట్వీట్స్ వేశారు. అలాగే టాలీవుడ్ లోనే ఇతర హీరోలు నాని, నాగచైతన్య తదితరులు అభిమానులకు ఫెస్టివల్ విషెస్ తెలియజేస్తూ ట్వీట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.