Pushpa 2 : దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో పుష్ప 2 భారీ ఈవెంట్స్.. ట్రైలర్ లాంచ్ అక్కడే..

ఇటీవల అన్ని పాన్ ఇండియా సినిమాలు దేశవ్యాప్తంగా తమ ప్రమోషన్స్ భారీగా చేస్తునారు.

Allu Arjun Pushpa 2

Pushpa 2 : పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కిన పుష్ప 1కు కంటిన్యూగా పుష్ప 2 సినిమా భర్తీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇప్పటికే పాటలు, గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా త్వరలో ఈ నెలలోనే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

Also Read : Ram Charan -Kiara Advani : గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్.. లక్నోలో బస్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్, కియారా.. వీడియో చూసారా..?

ఇక ఇటీవల అన్ని పాన్ ఇండియా సినిమాలు దేశవ్యాప్తంగా తమ ప్రమోషన్స్ భారీగా చేస్తునారు. నేడు గేమ్ ఛేంజర్ సినిమా కూడా లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా చేసారు. ఇప్పుడు పుష్ప 2 వంతు. తాజాగా పుష్ప 2 సినిమా భారీ ఈవెంట్స్ ని దేశంలోని ఏడు నగరాల్లో చేయబోతున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ఓ వీడియో ద్వారా తెలిపింది.

పాట్నా, కలకత్తా, చెన్నయ్‌, కొచ్చి, బెంగళూరు, ముంబయ్‌, హైదరాబాద్‌ లలో పుష్ప 2 మాసివ్‌ ఈవెంట్స్‌ను నిర్వహించబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను బీహార్ లోని పాట్నాలో గ్రాండ్ గా చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డులు సెట్ చేస్తుంది. ఇక రిలీజయ్యాక కలెక్షన్ల వర్షం కురవనుంది.