Ram Charan -Kiara Advani : గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్.. లక్నోలో బస్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్, కియారా.. వీడియో చూసారా..?

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ లాంచ్ నేడు లక్నోలో గ్రాండ్ గా నిర్వహించారు.

Ram Charan -Kiara Advani : గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్.. లక్నోలో బస్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్, కియారా.. వీడియో చూసారా..?

Ram Charan Kiara Advani Grand Entry on Bus at Game Changer Teaser Launch event

Updated On : November 9, 2024 / 7:15 PM IST

Ram Charan -Kiara Advani : నేడు గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ లాంచ్ నేడు లక్నోలో గ్రాండ్ గా నిర్వహించారు. రామ్ చరణ్ తో పాటు కియారా, అంజలి, SJ సూర్య, దిల్ రాజు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. లక్నోలోని ఓ థియేటర్ లో ఈ ఈవెంట్ నిర్వహించారు.

Also Read : Balakrishna – Allu Arjun : బాలయ్య అన్‌స్టాపబుల్ లో మరోసారి అల్లు అర్జున్.. గ్లింప్స్ కూడా రిలీజ్..

మొదట చరణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వరుస పూల దండలు, హారతులతో ఘన స్వాగతం పలికారు. అయితే హీరో – హీరోయిన్ కి స్పెషల్ ఎంట్రీ ప్లాన్ చేసారు. థియేటర్ బయట ఓ బస్ ని అరేంజ్ చేసి దాని చుట్టూ గేమ్ ఛేంజర్ బ్యానర్స్ పోస్టర్స్ తో డిజైన్ చేసి దాని పైకి రామ్ చరణ్, కియారా అద్వానీ ఎక్కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. పేపర్ బ్లాస్ట్ లు, టపాసులతో బస్సుపై చరణ్, కియారాలు అందరికి అభివాదం చేసారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

https://www.youtube.com/watch?v=cdG6X674OUQ

ఇది చూసి భలే ఎంట్రీ ప్లాన్ చేసారు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. లక్నోలో కూడా చరణ్ ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు. మొత్తానికి గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గానే చేసారు.