Allu Arjun Pushpa 2 movie ten days collection
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంటుంది.
Also Read : Akhil Akkineni : ఆ స్టార్ హీరోయిన్ తో అఖిల్ నెక్స్ట్ సినిమా.. ఎప్పుడంటే..
అయితే పుష్ప 2 సినిమా ఇప్పటికే విడుదలై వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన విషయం తెలిసిందే. కేవలం విడుదలైన 6 రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి రికార్డు బ్రేక్ చేసింది పుష్ప 2. షారుక్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల కలెక్షన్స్ బ్రేక్ చేసింది పుష్ప 2. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలై ఈ రోజుకు 10 రోజులు పూర్తి చేసుకుంది. ఇక పది రోజుల్లో 1292 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది పుష్ప 2. పుష్ప 2 కలెక్షన్స్ తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
పదిహేను వందల కోట్ల దిశగా పరుగులు తీస్తున్న పుష్ప 2 సినిమా మరికొన్ని రోజుల్లో పదిహేను వందల కోట్లు కూడా కొల్లగొట్టనుంది. విడుదలైన 10 రోజుల్లోనే 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రాబొయ్యే రోజుల్లో ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.