Akhil Akkineni : ఆ స్టార్ హీరోయిన్ తో అఖిల్ నెక్స్ట్ సినిమా.. ఎప్పుడంటే..
ఏజెంట్ ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Akhil Akkineni next movie with that star heroine
Akhil Akkineni : అక్కినేని అఖిల్ ఎంతో కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ చివరిగా ఏజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. అయినా కూడా ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో మరో సినిమా చెయ్యలేదు అఖిల్.
కాగా ఇప్పుడు ఏజెంట్ ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమాకి ఓకే చేసాడు అఖిల్. కాగా ఈ సినిమాకి కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తీసిన మురళీ కిషోర్ అబ్బోరు దర్శకత్వం వహించనున్నారు. ఇక ఇందులో అఖిల్ కి జోడీగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.
Also Read : Bigg Boss Season 8 : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. వారికి పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్..
ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక అఖిల్ ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. జైనబ్ రావడ్జితో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లుగా నాగార్జున తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుందని కూడా చెప్పాడు నాగార్జున.