Bigg Boss Season 8 : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. వారికి పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్..
అయితే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారట.

Bigg Boss grand finale strong warning from police
Bigg Boss Season 8 : ఇన్ని రోజులు ఎంతో ఆసక్తిగా, ఎంతో రసవత్తరంగా సాగిన బిగ్ బాస్ సీజన్ 8 ఈ రోజుతో ముగుస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీన అన్ లిమిటెడ్ ఫన్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డులతో కలిపి 22 మంది ఎంట్రీ ఇవ్వగా టాప్ 5 కంటెస్టెంట్స్ గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ నిలిచారు.
ఇన్ని రోజులు ఎంతో అలరించిన ఈ సీజన్ విన్నర్ ఎవరో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే దీనికి సంబందించిన ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అలాగే గ్రాండ్ ఫినాలేకి సంబందించిన ప్రోమో సైతం విడుదల చెయ్యగా పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా ఇందులో స్పెషల్ గా కనిపించారు. అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వచ్చారు.
Also Read : Lavanya Tripathi-Varun Tej : ‘హ్యాపీ బర్త్ డే బేబీ’.. లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ క్యూట్ విషెస్..
అయితే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారట. బిగ్ బాస్ షో ఫైనల్ సంధర్బంగా.. జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో ఆంక్షలు విదించారట. గత ఏడాది పల్లవి ప్రశాంత్ ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది. గతేడాది పల్లవి ప్రశాంత్ ట్రోఫీ తీసుకొని బయటికి వచ్చాక ఎంతటి రచ్చ జరిగిందో తెలిసిందే. అందుకే ఈ సారి అభిమానులు రావొద్దని పోలీసులు చెప్పినట్టు తెలుస్తుంది.
ఊరేగింపులు.. ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయంటు పోలీసులు తెలిపారు. ఇందిరా నగర్, కృష్ణా నగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు పోలీసులు. ఇప్పటికే బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఎలాంటి న్యూసెన్స్ జరిగినా బాధ్యత మీదే అంటూ ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులకు హెచ్చరికలు కూడా జారీ చేశారట పోలీసులు.