Lavanya Tripathi-Varun Tej : ‘హ్యాపీ బర్త్ డే బేబీ’.. లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ క్యూట్ విషెస్..

అయితే నేడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి బర్త్ డే.

Lavanya Tripathi-Varun Tej : ‘హ్యాపీ బర్త్ డే బేబీ’.. లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ క్యూట్ విషెస్..

Happy Birthday Baby Varun Tej Cute Wishes to wife Lavanya Tripathi

Updated On : December 15, 2024 / 3:07 PM IST

Lavanya Tripathi-Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు చేసి భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. అలా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో పాడారు. ఆ తర్వాత దాదాపుగా ఏడేళ్లు ఎంతో గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

Also Read : Allu Arjun- Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో అల్లు అర్జున్ దంపతులు.. ఫోటో అదిరిందిగా..

అయితే నేడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి బర్త్ డే. ఇక ఈ సందర్బంగా ఆమె ఫాన్స్, ఆమె సినీ ఫ్రెండ్స్ తనకి బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే తాజాగా తన భర్త వరుణ్ తేజ్ కూడా లావణ్యకి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు. వారు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇలా పేర్కొన్నాడు..” పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ.. నువ్వు నా జీవితంలోకి వచ్చి చాలా ఆనందం, శాంతిని తెచ్చావు. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి జ్ఞాపకం నీతో మరింత అందంగా ఉంటుంది. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను.. నన్ను డ్యాన్స్ చేసేలా చేసేది నువ్వు ఒక్కదానివే..” అంటూ తెలిపాడు. అలా వారిద్దరికి సంబందించిన కొన్ని క్యూట్ ఫోటోలని కూడా షేర్ చేశారు వరుణ్ తేజ్.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)