Allu Arjun Pushpa 2 Six Days Collections
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం రూ.1002 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది.
భారతీయ సినీ చరిత్రలో ఓ చిత్రం విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. దీంతో బన్నీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 జోరు చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.
Akhanda 2 : బాలయ్య-బోయపాటి ‘అఖండ 2’ నుంచి సాలీడ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్..
ఈ చిత్రంలో అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని సినీ ప్రియులు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్‌లో హైలెట్ అని చెబుతున్నారు.
రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రం పుష్ప మూవీకి సీక్వెల్‌గా వచ్చింది. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్ లు కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ లు నిర్మించారు.
THE BIGGEST INDIAN FILM rewrites history at the box office 💥💥💥#Pushpa2TheRule becomes the FASTEST INDIAN FILM to cross 1000 CRORES GROSS WORLDWIDE in 6 days❤🔥#PUSHPA2HitsFastest1000Cr
Sukumar redefines commercial cinema 🔥
Book your tickets now!
🎟️… pic.twitter.com/GLsTv9LeGO— Mythri Movie Makers (@MythriOfficial) December 11, 2024