Akhanda 2 : బాలయ్య-బోయపాటి ‘అఖండ 2’ నుంచి సాలీడ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్..
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న మూవీ అఖండ 2.

Balakrishna Akhanda 2 Release Date fix
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న మూవీ ‘అఖండ 2’. అఖండ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపింది. అంతేనా.. ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తామన్న సంగతిని తెలియజేసింది.
వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ వీడియో ద్వారా చెప్పింది. ఈ వీడియోలో బాలయ్య సినిమా లాంఛ్ సమయంలో చెప్పిన డైలాగ్ చూపిస్తూ, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ప్లే చేసింది. అంతేకాదండోయ్ ఇక శివుడి తాండవం చేస్తున్న విజువల్స్ ను చూపించింది.
బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న వార్తలు వస్తున్నాయి.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇది 4వ సినిమా. గతంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ లు భారీ విజయాలను అందుకున్నాయి.
Manchu Manoj : ‘ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా దాంట్లో తప్పేంటి’.. మనోజ్ ఎమోషనల్