Allu Arjun Rashmika Mandanna Pushpa 2 Movie Teaser Update
Pushpa Teaser : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప ది రూల్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. కాగా ఈ మూవీ నుంచి గత ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజుకి ఓ స్పెషల్ వీడియోని తీసుకు వచ్చి ఫ్యాన్స్‌ని ఖుషి చేశారు.
ఇక ఈ పుట్టినరోజు మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. అయితే కచ్చితమైన టైంని అనౌన్స్ చేయలేదు. ఇక ఈ టీజర్ అప్డేట్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్.. జాతర సాంగ్ కి సంబంధించిందని తెలుస్తుంది. జాతరలో అల్లు అర్జున్ అమ్మోరులా నాట్యం చేయనున్నారట. అలాగే ఆ బ్యాక్ డ్రాప్ లో ఓ అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతుంది.
Also read : NTR : కొత్త కారు కొన్న ఎన్టీఆర్.. ఆ కారు విలువ ఎంతో తెలుసా..
Let the #PushpaMassJaathara begin ?
??? ???? ??????? #Pushpa2TheRuleTeaser out on April 8th ❤️?❤️?
He is coming with double the fire ??#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/gCPRAxqoPh
— Pushpa (@PushpaMovie) April 2, 2024
కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే సుకుమార్ చాలా ఖర్చు చేసి తెరకెక్కించారట. మూవీకి ఈ సీక్వెన్స్ హైలైట్ కాబోతుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవిశ్రీ డిస్కోగ్రాఫీలో వచ్చిన డివోషనల్ బ్యాక్ డ్రాప్ సాంగ్స్ అన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. మరి ఇప్పుడు ఈ జాతర సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి.