Allu Arjun : ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ విజ్ఞప్తి.. ఫ్యాన్స్ ముసుగులో అలా చేస్తే చర్యలు తీసుకోబడతాయి..

తాజాగా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి ఓ విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

Allu Arjun Request to his Fans Tweet goes Viral

Allu Arjun : అల్లు అర్జున్ – సంధ్య థియేటర్ ఘటన రోజు రోజుకి మరింత జటిలం అవుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నా తప్పేమి లేదు, నాపై తప్పుడు ఆరోపణలు చేశారు అంటూ మాట్లాడారు. దీంతో పలువురు కాంగ్రెస్ నాయకులూ అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు.

అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది సీఎం రేవంత్ రెడ్డిపై, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ పోలీసులు సోషల్ మీడియాలో సీఎంపై వ్యాఖ్యలు చేసిన పలువురిపై కేసులు నమోదు చేశారు. దీంతో తాజాగా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి ఓ విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

Also Read : Telangana DGP – Allu Arjun : అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదు.. హీరోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం..

అల్లు అర్జున్ తన ట్వీట్ లో.. నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ID, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్ కు సూచిస్తున్నాను. సోషల్ మీడియాలోనూ, బయట కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. దీంతో బన్నీ ట్వీట్ వైరల్ గా మారింది.