Allu Arjun – Pushpa 2 : లాస్ట్ డే.. లాస్ట్ షాట్.. పుష్ప షూట్ కంప్లీట్ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. పుష్ప జాతరకు రెడీ అవ్వండి..

బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Allu Arjun Shares a post with Photo from Pushpa 2 Sets

Allu Arjun : గత కొన్ని రోజులుగా పుష్ప 2 షూట్ ఇంకా అవ్వలేదు, ఇంకా ఒక సాంగ్ షూట్ ఉంది, నాలుగు రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది అని వార్తలు వస్తున్నాయి. దీంతో సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ అవుతుందా అవ్వదా అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ అల్లు అర్జున్ నేడు ఓ పోస్ట్ చేసాడు.

Also See : Akhil Akkineni Engagement : నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని అఖిల్.. ఫొటోలు వైరల్..

అల్లు అర్జున్ అధికారికంగా పుష్ప షూట్ పూర్తయింది అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. పుష్ప 2 షూటింగ్ సెట్ నుంచి ఒక ఫోటో షేర్ చేసి.. లాస్ట్ డే, లాస్ట్ షాట్ ఆఫ్ పుష్ప. 5 ఏళ్ళ పుష్ప జర్నీ పూర్తయింది అంటూ పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అల్లుఅర్జున్ పోస్ట్ తో పుష్ప 2 వాయిదా పడదని, చెప్పిన డేట్ కి వచ్చేస్తుందని క్లారిటీ వచ్చేసింది.

 

దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. దేశమంతా భారీ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇక పుష్ప సినిమా గురించి బన్నీ కూడా ఓ రేంజ్ లో చెప్తున్నాడు. ఇటీవల బాలయ్య షోలో మాస్ చూసారు, ఊర మాస్ చూసారు ఇప్పుడు జాతర మాస్ చూస్తారు అంటూ పుష్ప 2 పై మరిన్ని అంచనాలు పెంచాడు.