Allu Arjun : నేషనల్ అవార్డు అందుకునే ముందు నేషనల్ మీడియాతో అల్లు అర్జున్ ఏం మాట్లాడాడో తెలుసా?

బన్నీ విజ్ఞాన భవన్ కి చేరుకున్నాక అవార్డు తీసుకునేముందు నేషనల్ మీడియాతో ముచ్చటించాడు.

Allu Arjun Spoke with National media Before Receiving National Best Actor Award

Allu Arjun :  69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారం నిన్న అక్టోబర్ 17న సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు అందరూ తమ అవార్డులను అందుకున్నారు. 2021 సంవత్సరానికి గాను ఇచ్చిన అవార్డుల్లో పుష్ప(Pushpa) సినిమాలో తన నటనకు గాను బన్నీ నేషనల్ బెస్ట్ యాక్టర్(National Best Actor) అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కి మొదటిసారి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకొచ్చి సరికొత్త చరిత్ర సృష్టించాడు బన్నీ.

బన్నీ విజ్ఞాన భవన్ కి చేరుకున్నాక అవార్డు తీసుకునేముందు నేషనల్ మీడియాతో ముచ్చటించాడు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంతేకాక ఒక కమర్షియల్ సినిమాకి ఈ అవార్డు అందుకోవడం డబుల్ అచివ్మెంట్ అనిపిస్తుంది అని చెప్పాడు. అలాగే పుష్పలోని ఏదైనా డైలాగ్ చెప్పమని అడగ్గా.. తగ్గేదెలా అంటూ తన మ్యానరిజం చూపించాడు బన్నీ.

Also Read : Balakrishna : అన్‌స్టాపబుల్‌లో ఇండైరెక్ట్‌గా బాబు గురించి బాలయ్య.. చంద్రుడు ఉదయిస్తాడు.. తప్పు చేయలేదని మీకు తెలుసు..

అల్లు అర్జున్ రాష్ట్రపతి చేతులమీదుగా బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. ఈ వేడుకకు అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, బన్నీ సతీమణి స్నేహ రెడ్డి కూడా వెళ్లారు. బన్నీ అవార్డు తీసుకున్నాక అక్కడకు వచ్చిన పలు భాషల సినీ ప్రముఖులు బన్నీకి అభినందనలు తెలిపారు. ఇక సోషల్ మీడియాలో అయితే అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు బన్నీకి కంగ్రాట్స్ చెప్తున్నారు.