Allu Arjun Spotted In Uber Cool Look Pic Goes Viral
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు బన్నీ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమాను పుష్ప-1 కంటే కూడా ఎక్కువ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
Allu Arjun : అల్లు అర్హ చేసిన పనికి అల్లు అర్జున్ షాక్.. స్నేహారెడ్డి పోస్ట్ చూశారా?
ఇక ఈ సినిమాలో బన్నీ మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా, ఈ సినిమాలో బన్నీ లుక్ ఎలా ఉండబోతుందా.. పుష్ప-1 స్టార్టింగ్‌లో ఊరమాస్‌గా ఉంటూ, క్లైమాక్స్ వచ్చేసరికి కాస్త స్టైలిష్‌గా మారిపోయిన బన్నీ మనకు కనిపించాడు. దీంతో ఇప్పుడు పుష్ప-2లో బన్నీ ఎలాంటి లుక్‌తో కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా, బన్నీ అల్ట్రా స్టైలిష్‌లో కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.
Allu Arjun : అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేశాడు.. వరుడు హీరోయిన్ భానుశ్రీ!
బన్నీ ఇలా స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పుష్ప-2 సినిమాలో బన్నీ ఈ గెటప్‌లో కనిపిస్తే థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.