Nainika : మా నాన్న మంచోడు కాదు.. వెళ్ళిపోమన్నాను.. అమ్మని టార్చర్ పెట్టారు.. బిగ్ బాస్ నైనిక కామెంట్స్..
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న డ్యాన్సర్ నైనిక తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.(Nainika)

Nainika
Nainika : డ్యాన్స్ షో ఢీతో ఫేమ్ తెచ్చుకుంది నైనిక. ఆ తర్వాత సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించింది. బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొని నైనిక మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక టీవీ షోలు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ డ్యాన్స్ మాస్టర్ గా, ఆర్టిస్ట్ గా ప్రయత్నాలు చేస్తుంది నైనిక.(Nainika)
తాజాగా నైనిక ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో మీరెప్పుడూ మీ అమ్మ గురించే చెప్తారు, ఆమెతోనే కనిపిస్తారు. మీ నాన్న గురించి చెప్పరు ఎందుకు అని ప్రశ్నించారు.
నైనిక సమాధానమిస్తూ.. ఆయన మాతో ఉండరు. నాన్న డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. ఆయన మంచోడు కాదు. నేను ఆయన్ని మిస్ అవ్వను. ఆయన మా అమ్మని టార్చర్ చేయడం చూసాను. నాకు మా అమ్మ అంటే ఇష్టం. అందుకే ఆయన మా అమ్మ కోసం ఏం చేయనవసరం లేదు, మా ఫ్యామిలీకి మీరొద్దు వెళ్లిపోండి అని చెప్పేసాను అని తెలిపింది.