Malayali Actress : పవన్ సినిమాతో ఎంట్రీ.. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ ని మించి.. ఈ హీరోయిన్ చేతిలో ఇన్ని సినిమాలా.. వామ్మో..
స్టార్ హీరోయిన్స్ కి కూడా చేతి నిండా సినిమాలు ఉండట్లేదు కానీ ఈ మలయాళ భామకు చేతినిండా తెలుగు సినిమాలు ఉన్నాయి.(Malayali Actress)

Malayali Actress
Malayali Actress : ఒక సినిమా హిట్ అయితే వరుస అవకాశాలు వస్తాయి హీరోయిన్స్ కి. కొంతమంది వచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. కొంతమంది మాత్రం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటారు. ఇటీవల కొత్త కొత్త హీరోయిన్స్ వస్తుండటంతో స్టార్ హీరోయిన్స్ కి కూడా చేతి నిండా సినిమాలు ఉండట్లేదు కానీ ఈ మలయాళ భామకు చేతినిండా తెలుగు సినిమాలు ఉన్నాయి.(Malayali Actress)
ఇంతకీ ఆ మలయాళ భామ ఎవరో కాదు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్. మలయాళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన సంయుక్త తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసారా, ధనుష్ తో సార్, సాయి ధరమ్ తేజ్ తో విరూపాక్ష సినిమాలు చేసి వరుస హిట్స్ కొట్టింది. కళ్యాణ్ రామ్ తో డెవిల్ అనే సినిమాతో పర్వాలేదనిపించింది.
Also See : Kishkindhapuri : బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఇలా తెలుగులో వరుసగా విజయాలు సాధించింది సంయుక్త. 2023 తర్వాత ఈ అమ్మడికి గ్యాప్ వచ్చింది. ఇటీవల లవ్ మీ అనే సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందేంటి, చేతిలో సినిమాలు లేవా అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే చేతి నిండా ఆల్మోస్ట్ 8 సినిమాలు ఉన్నాయి ఈ భామకు.
నేడు సంయుక్త పుట్టిన రోజు కావడంతో ఆ సినిమా యూనిట్స్ అందరూ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేయడంతో సంయుక్త చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సంయుక్త చేతిలో బాలకృష్ణ అఖండ 2, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ, పూరీ – విజయ్ సేతుపతి సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్ హైందవ, నిఖిల్ స్వయంభు, లారెన్స్ బెంజ్, హిందీలో మహారాణి, తెలుగులో మరో సినిమా.. ఉన్నాయి.
Also Read : Mirai Sequel : ‘మిరాయ్’ సీక్వెల్ టైటిల్ ఏంటో తెలుసా? కలియుగంలో రావణ వర్సెస్ రామ కథతో.. రావణుడు ఎవరంటే..
దీంతో సంయుక్త చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ కి కూడా ఇన్ని సినిమాలు లేవు అని ఆశ్చర్యపోతూనే సంయుక్త సైలెంట్ గా దూసుకుపోతుంది అని అంటున్నారు. రెండేళ్లు గ్యాప్ తీసుకున్నా సంయుక్త త్వరలో వరుస పెట్టి తన సినిమాలతో రాబోతునని తెలుస్తుంది. వరుస హిట్స్ మీద ఉన్న సంయుక్తకు ఇవి కూడా హిట్ అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు.