Allu Arjun Lady Getup : పుష్ప లేడీ గెటప్ గురించి మాట్లాడిన బన్నీ.. ఫొటోషూట్ అంతా చేశాక సుకుమార్ నచ్చలేదని..

తాజాగా మరోసారి అల్లు అర్జున్ పుష్ప 2 లేడీ గెటప్ గురించి మాట్లాడారు.

Allu Arjun talk about Lady Getup in Pushpa 2 Movie at Mumbai Event

Allu Arjun Lady Getup : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు రావడానికి బన్నీ లేడీ గెటప్ కూడా ఒక కారణం. బన్నీ లేడీ గెటప్ లో పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర్నుంచి జాతరలో ఫైట్ సీక్వెన్స్ గ్లింప్స్, తర్వాత ట్రైలర్.. అన్ని చూసాక లేడీ గెటప్ సీక్వెన్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ కూడా ఈ జాతర సీక్వెన్స్ అదిరిపోతుంది. ఆ లేడీ గెటప్ కు చాలా కష్టపడ్డాను, 3 గంటలు మేకప్ వేసుకున్నాను, బ్యాక్ పెయిన్ కూడా వచ్చి కొన్ని డేస్ షూటింగ్ ఆపేసాను అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

తాజాగా మరోసారి అల్లు అర్జున్ పుష్ప 2 లేడీ గెటప్ గురించి మాట్లాడారు. నిన్న ముంబైలో పుష్ప ఐకానిక్ ప్రెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ తన పుష్ప 5 ఏళ్ళ జర్నీ గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఈ లేడీ గెటప్ ఫస్ట్ పోస్టర్ గురించి కూడా మాట్లాడాడు.

Also Read : Allu Arjun : పుష్ప మొదలైనప్పట్నుంచి అయిదేళ్ల ఎమోషనల్ జర్నీ.. ముంబైలో పుష్ప ప్రయాణంపై మాట్లాడిన అల్లు అర్జున్..

అల్లు అర్జున్ మాట్లాడుతూ .. ఈ పోస్టర్ పుష్ప 2 ఇంత పెద్దగా అవ్వడానికి ఉపయోగపడింది. ఇదంతా సుకుమార్ గారి ఐడియానే. పోస్టర్స్ కోసం పుష్ప గెటప్ తో, సఫారీ షూట్స్ తో కొన్ని ఫోటోషూట్స్ చేసాము. అవన్నీ బాగానే వచ్చాయి. అంతా అయిపోయాక ఇదంతా కాదు కొత్తగా చేద్దాం అని సుకుమార్ అనడంతో ఫోటోషూట్ అయ్యాక చెప్తాడేంటి అని ఆశ్చర్యపోయా. ఫోటోషూట్ మొత్తం అయ్యాక మళ్ళీ చేద్దాం అంటావేంటి అని సుకుమార్ ని అడిగితే నేను ఆడియన్స్ కి అందరికి ఒక షాక్ ఇద్దాం అనుకుంటున్నా అన్నారు. ఏం షాక్ అంటే లేడీ గెటప్ అన్నారు. నేను వాట్ అని ఆశ్చర్యపోయా. దాంతో ఆయన ఏమనుకుంటున్నాడో మొత్తం చెప్పాడు. సుకుమార్ చెప్పినట్టు చేశాను. లేడీ గెటప్స్ మీద కూడా చాలా కష్టపడి రెండు సార్లు వర్కౌట్ అవ్వక మూడో సారి ఓకే చేసారు సుకుమార్. నా లుక్ చూసిన తర్వాత సుకుమార్ క్రియేటివిటీ గురించి మరింత అర్ధమయింది. నా లైఫ్ లోనే అత్యంత కష్టమైన సీక్వెన్స్ ఈ గెటప్ లో చేసిందే. ఇంతకంటే ఎక్కువ నేనేమి చెప్పను. సినిమాలో చూసి ఆ సీక్వెన్స్ ఎలా ఉందో మీరే చెప్పండి. ఇదంతా జీనియస్ సుకుమార్ కే క్రెడిట్ దక్కుతుంది అని అన్నారు.