Allu Arjun : పుష్ప మొదలైనప్పట్నుంచి అయిదేళ్ల ఎమోషనల్ జర్నీ.. ముంబైలో పుష్ప ప్రయాణంపై మాట్లాడిన అల్లు అర్జున్..
2019లో పుష్ప సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ళ ఎమోష్నక్ జర్నీని గుర్తుచేసుకున్నారు అల్లు అర్జున్.

Allu Arjun Reminds Pushpa Five Years Journey in Mumbai Event
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులతో పాటు దేశమంతా పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ భారీగా ప్రమోషన్స్ చేయడంలో బిజీగా ఉంది. నిన్న ముంబైలో పుష్ప ఐకానిక్ ప్రెస్ మీట్ గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ తన పుష్ప ప్రయాణం గురించి మాట్లాడారు.
2019లో పుష్ప సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ళ ఎమోష్నక్ జర్నీని గుర్తుచేసుకున్నారు అల్లు అర్జున్. ఈ ఐదేళ్లలో ముఖ్యమైన ఘట్టాలను తాను చేసిన ట్వీట్స్ ని అక్కడ స్టేజి పై చూపించి వాటి గురించి మాట్లాడారు. పుష్ప సినిమా మొదలుపెట్టినప్పుడు, కొత్త ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు, పుష్ప టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు, సుకుమార్ గురించి, దేవిశ్రీ ప్రసాద్ గురించి, పుష్ప 2 ఫస్ట్ లుక్ గురించి, పుష్ప 2 ప్రమోషన్స్ గురించి, రష్మిక గురించి, చివరి రోజు షూట్ గురించి.. ఇలా అన్ని విషయాల గురించి అల్లు అర్జున్ ముంబై స్టేజిపై మాట్లాడుతూ పుష్ప జర్నీని మరోసారి గుర్తు చేసుకున్నారు.
దీంతో ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ స్పీచ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అన్ని విషయాల గురించి ప్రస్తావిస్తూ చెప్పడంతో, అయిదేళ్ల పుష్ప ప్రయాణం గురించి చెప్పడంతో ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. అయిదేళ్ల ప్రయాణం డిసెంబర్ 5న ముగియనుంది తనతో పనిచేసే వాళ్ళందరిని గుర్తు చేసుకుంటూ అందరికి ధనువాదాలు చెప్తూ బన్నీ కూడా ఎమోషనల్ అయ్యారు. మీరు కూడా అల్లు అర్జున్ ముంబై స్పీచ్ వినేయండి..