అలకనంద ఎవరు?

అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సినిమా అలకనంద?

  • Published By: sekhar ,Published On : April 17, 2019 / 07:24 AM IST
అలకనంద ఎవరు?

Updated On : April 17, 2019 / 7:24 AM IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సినిమా అలకనంద?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఎస్.రాధాకృష్ణ(చినబాబు), అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పుడీ సినిమా టైటిల్ గురించి ఫిలింనగర్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న ఈ మూవీకి ముందుగా, నాన్న-నేను అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తాలొచ్చాయి.. కానీ, మూవీ యూనిట్ దాన్ని ధృవీకరించలేదు. ఇప్పుడు ‘అలకనంద’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

త్రివిక్రమ్‌కి ‘అ’ సెంటిమెంట్ ఉందని, అతడు, అత్తారింటికి దారేది, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత లాంటి టైటిల్స్ అన్నీ ‘అ’ అక్షరంతోనే స్టార్ట్ అయ్యాయని, ఆసెంటిమెంట్‌ని కారణంగానే బన్నీతో చెయ్యబోయే సినిమాకి అలకనంద అనే పేరుని పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత, అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఏప్రిల్ 24 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.