Allu Arjun Visits Amritsar Golden Temple Along With Wife And Children
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా బన్నీ తన భార్యాపిల్లలతో కలిసి స్వర్ణ దేవాలయంలో పూజలు చేశారు. ఇతర భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వర్ణ దేవాలయంలో సర్వేశ్వరుని ఆశీస్సులు పొందాలని సాధారణ భక్తుడిగా క్యూలైన్‌లో నిల్చొని వెళ్లారు బన్నీ అండ్ ఫ్యామిలీ.
Allu Arjun: బన్నీతో రొమాన్స్‌కు రెడీ అవుతోన్న బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే?
తన జీవితభాగస్వామి పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా చేసేందుకు ఇలా గోల్డెన్ టెంపుల్‌లో పూజలు చేశాడు ఈ స్టార్ హీరో. అయితే పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న బన్నీని చూసేందుకు భక్తులు ఆసక్తిని కనబరిచారు. తనకు గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించాలని ఎప్పటినుండో ఉన్నా, నేటికి అది కుదిరిందని బన్నీ చెప్పుకొచ్చాడు. ఇక తన భార్య, పిల్లలతో బన్నీ గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Allu Arjun: గణేశ్ నిమజ్జనంలో పాల్గొన్న అల్లు అర్జున్, అల్లు అర్హ!
తన భార్యతో పాటు కూతురు అర్హ, కొడుకు అయాన్‌లు కూడా ఈ ఫోటోల్లో కనిపిస్తుండటంతో బన్నీ అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. స్వర్ణ దేవాయలంలో పూజలు చేసిన అనంతరం, అక్కడ కొందరు మతపెద్దల ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక సినిమాల పరంగా బన్నీ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.