‘రాములో రాములా.. నన్నాగంజేసిందిరో.. పాటకు అల్లు అర్జున్ వాయిస్ ఇవ్వడం విశేషం.. పూర్తి సాంగ్ దీపావళి కానుకగా అక్టోబర్ 26న విడుదల చేయనున్నారు..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల వైకుంఠపురములో’… ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’ పాట యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 50 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ‘రాములో రాములా.. నన్నాగంజేసిందిరో.. ‘రాములో రాములా.. నా పాణం తీసిందిరో.. అనే సాంగ్ టీజర్ ఆకట్టుకుంటోంది.
ఈ పాటకు అల్లు అర్జున్ వాయిస్ ఇవ్వడం విశేషం.. బన్నీ వాయిస్ ఓవర్ ఫుల్ సాంగ్‌లో వినొచ్చని మూవీ టీమ్ తెలిపింది.. థమన్ ట్యూన్, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు. భారీ సెట్లో పిక్చరైజ్ చేసిన ఈ పాటలో హీరోయిన్స్‌తో సహా సినిమాలోని ఇతర తారాగణమంతా కనిపించనున్నారని టీజర్ చూస్తే తెలుస్తుంది. థమన్ మాస్ బీట్‌కి బన్నీ తన మార్క్ స్టెప్స్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేయడం పక్కా అనిపిస్తోంది.
Read Also : ఆర్టికల్ 370 ఆధారంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’
పూర్తి సాంగ్ దీపావళి కానుకగా అక్టోబర్ 26న విడుదల చేయనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.
This is amazing!!!#AAvoiceoveronRamulooRamula ?
With magical #Trivikram sir’s writing!!#AlaVaikunthapurramuloo #AlluArjun #Trivikram pic.twitter.com/AUbYEahdUS— Shreyas Group (@shreyasgroup) October 26, 2019