Allu arjun wax statue at Madame Tussauds museum
Allu arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా అరుదైన ఘనతలు సాదించుకుంటూ ముందుగా వెళ్తున్నాడు. ఇటీవలే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకున్న మొట్టమొదటి టాలీవుడ్ యాక్టర్ గా సంచలనం సృష్టించిన బన్నీ.. ఇప్పుడు మరో గౌరవాన్ని అందుకున్నాడు. పుష్ప (Pushpa) సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ లెవెల్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ ఫేమ్ బన్నీకి అరుదైన గౌరవం తెచ్చిపెట్టినట్లు తెలుస్తుంది.
Vicky Kaushal – Katrina Kaif : కత్రినాతో గొడవ వస్తే.. విక్కీ కౌశల్ చేసే మొదటి పని ఏంటో తెలుసా..?
లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. అక్కడ తమ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఇప్పటికే అక్కడ మన తెలుగు హీరోలు ప్రభాస్, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే అల్లు అర్జున్ ఈ విగ్రహం కోసం కొలతలు ఇవ్వడానికి లండన్ వెళ్లనున్నాడట.
Unstoppable 3 : అన్‌స్టాపబుల్ సీజన్ 3లో చిరంజీవి, కేటీఆర్.. డేట్స్ కోసం చూస్తున్న..
మరి దీనిలో ఎంత నిజముందో తెలియదు గాని బన్నీ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే.. ఈ ఘనత సాధించిన మరో సౌత్ యాక్టర్ గా అల్లు అర్జున్ నిలుస్తాడు. ఇది ఇలా ఉంటే, ఇప్పటికే పుష్ప 2 పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే నేషనల్ అవార్డు తరువాత ఆ అంచనాలు మరింత రేటింపు అవుతూ వస్తున్నాయి. తాజాగా ఓర్మాక్స్ మీడియా ఒక సర్వే నిర్వహించింది. బాలీవుడ్ ప్రేక్షకులు ఏ సినిమా కోసం ఎక్కువ ఆసక్తి ఎదురు చూస్తున్నారు అని సర్వే నిర్వహించగా.. పుష్ప 2 మొదటి స్థానం దక్కించుకుంది. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.