Allu Arjun went to Nalgonda for his uncle Kancharla Chandrashekar Reddy new convention center opening Ceremony
Allu Arjun : ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పుష్ప(Pushpa) సినిమాతో దేశమంతటా భారీ విజయం సాధించిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2తో మరింత గ్రాండ్ గా రాబోతున్నాడు. అభిమానులు, ప్రేక్షకులు పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ తన మామ కోసం నల్గొండ వెళ్ళాడు.
అల్లు అర్జున్ భార్య స్నేహ(Sneha) వాళ్ళ నాన్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancharla Chandrashekar Reddy) ప్రస్తుతం బీఆర్ఎస్(BRS) తరపున రాజకీయాల్లో ఉన్నారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. అయితే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తాజాగా నల్గొండలోని పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామంలో ఓ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కంచర్ల కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి అల్లుడు బన్నీని పిలిచారు.
Mr Pregnant : దూసుకుపోతున్న మిస్టర్ ప్రగ్నెంట్.. సరికొత్త కథతో సాహసం చేసిన సోహైల్..
దీంతో కంచర్ల కన్వెన్షన్ ని ఓపెన్ చేయడానికి అల్లు అర్జున్ తన మామ ఆహ్వానం మీద నేడు నల్గొండకు వెళ్లారు. అల్లు అర్జున్ ని చూడటానికి చుట్టుపక్కల నుంచి కూడా భారీగా అభిమానులు వచ్చారు. బన్నీకి భారీ బ్యానర్స్ తో వెల్కమ్ చెప్పారు. గజమాలతో అల్లు అర్జున్ కి స్వాగతం పలికారు అభిమానులు. కంచర్ల కన్వెన్షన్ ఓపెనింగ్ అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు.
Nalgonda @alluarjun fans Welcomed their King into their Fort with Garland #AlluArjunInNalgonda pic.twitter.com/UqhhAKSLnn
— Hemanth Kiara (@ursHemanthRKO) August 19, 2023
Most celebrated hero ???
Huukum @alluarjun kaa huukum #Pushpa2TheRule #AlluArjun #AlluArjunInNalgonda pic.twitter.com/OMZ3sNM2Xw— HYD AlluArjun Fans & welfare Association (@AIAFA_Hyderabad) August 19, 2023
Icon StAAr #AlluArjun gets a walm welcome in Nalgonda?
||#AlluArjunInNalgonda |#Pushpa| #Pushpa2 |#Pushpa2TheRule || pic.twitter.com/7T9knl8jc0
— Manobala Vijayabalan (@ManobalaV) August 19, 2023