Mr Pregnant : దూసుకుపోతున్న మిస్టర్ ప్రగ్నెంట్.. సరికొత్త కథతో సాహసం చేసిన సోహైల్..

భార్యకి వచ్చే ప్రెగ్నెన్సీని తను తీసుకొని ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ గా మారితే ఏమైంది, మారిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు, ఎలాంటి పరిస్థితులని చూశాడు అనే కథాంశంతో మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌ సినిమాని తెరకెక్కించారు.

Mr Pregnant : దూసుకుపోతున్న మిస్టర్ ప్రగ్నెంట్.. సరికొత్త కథతో సాహసం చేసిన సోహైల్..

Syed Sohel Mr Pregnant Movie getting Huge Positive Response in all theaters

Updated On : August 19, 2023 / 12:18 PM IST

Mr Pregnant :  బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ (Syed Sohel) వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఆగస్టు 18న మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌ (Mr Pregnant) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోహైల్. రూపా కొడవాయుర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. భార్యకి వచ్చే ప్రెగ్నెన్సీని తను తీసుకొని ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ గా మారితే ఏమైంది, మారిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు, ఎలాంటి పరిస్థితులని చూశాడు అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమాలో కామెడీతో పాటు అమ్మ గొప్పతనం, మాతృత్వం, ఎమోషనల్ సీన్స్, ప్రెగ్నెన్సీ మహిళల కష్టాలు అన్ని చూపించి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు. ఎమోషనల్ మ్యూజిక్, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రెగ్నెంట్ గా సోహైల్ యాక్టింగ్ కోసం చాలా కష్టపడ్డాడు. దీంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా మహిళలు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా చూస్తున్నంత సేపు, చూశాక కన్నీళ్లు పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో థియేటర్స్ కి వస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా విజయంపై చిత్రయూనిట్ సంతోషంగా ఉంది. మొదటి రోజు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చినట్టు సమాచారం. వీకెండ్ ఉండటంతో ఈ రెండు రోజుల్లో మరింత కలెక్షన్స్ రానున్నాయి.

Rajinikanth : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి జైలర్ చూడనున్న రజినీకాంత్..

తెలుగులో ఇది కొత్త కాన్సెప్ట్. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న సోహైల్ చేయడం అంటే ధైర్యం చేశాడనే చెప్పొచ్చు. ఒక స్పెషల్ సినిమాగా మిస్టర్ ప్రెగ్నెంట్ నిలుస్తుంది. సోహైల్ కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ ఎన్ని వచ్చినా ఈ సినిమా మాత్రం ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోవడం ఖాయం అంటున్నారు ఆడియన్స్.