Allu Arvind Multistarrer with chiru and balayya
Unstoppable episode 5 : తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహా.. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోతో రెండు తెలుగురాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తోంది. నిక్కర్చిగా మాట్లాడే బాలకృష్ణని ఈ షోకి వ్యాఖ్యాతగా పెట్టి.. చంద్రబాబు, మోహన్ బాబు, మహేష్ బాబు వంటి ఎంతోమంది సినీరాజకీయ నాయకుల జీవితాల్లో దాగున్న పలు కీలక విషయాలను అభిమానులకు తెలిసేలా చేస్తుండడంతో, అన్‌స్టాపబుల్ షో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతుంది.
Unstoppable episode 4 : చిరంజీవిలో నచ్చనిది ఏంటి.. బాలయ్యలో నచ్చేది ఏంటి.. రాధిక జవాబు!
కాగా రెండో సీజన్ ఎపిసోడ్-5కి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబులతో పాటు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు హాజరయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు నిర్వాహుకులు. “సురేష్ గారితో నేను సినిమాలు చేశాను, కానీ మన ఇద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు” అంటూ బాలకృష్ణ, అల్లు అరవింద్ ని ప్రశ్నించాడు.
దానికి అల్లు అరవింద్.. “మిమ్మల్ని, చిరంజీవి గారిని కలిపి ఒక మల్టీస్టారర్ సినిమా చేద్దామని ఎదురుచూస్తున్నా” అంటూ బదులిచ్చాడు. ఈ మాటలకూ బాలకృష్ణ స్పందిస్తూ.. “అయితే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది అప్పుడు” అంటూ వ్యాఖ్యానించాడు. మరి అల్లు అరవింద్ అన్నట్లు ఈ కాంబినేషన్ సెట్ చేస్తాడో? లేదో? చూడాలి. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ఫ్యాన్స్ కి పూనకాలే.