Allu Sirish announced his wedding date
Allu Sirish: అల్లు అరవింద్ మూడో తనయుడు అల్లు శిరీష్(Allu Sirish Marriage) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన తన ప్రియురాలు నయనికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తాజాగా తన పెళ్లి డేట్ ను అధికారికంగా ప్రకటించాడు అల్లు శిరీష్. 2026 మర్చి 6వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించాడు. తన అన్న అల్లు అర్జున్ పిల్లల తోపాటు పెద్దన్న పిల్లలు కలిసి ట్రెండింగ్ లో ఒక సాంగ్‌తో పెళ్లి డేట్ ను అధికారికంగా రివీల్ చేశాడు అల్లు శిరీష్. దీంతో అల్లు శిరీష్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ల వివాహం కూడా మార్చి 6నే జరగడం. 2011, మార్చి 6న అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల పెళ్లి జరిగింది. ఇప్పుడు అదే తేదీన 15 ఏళ్ల తర్వాత అల్లు శిరీష్ పెళ్లి జరుగబోతోంది.
Arith Shankar: హీరోగా ఎంట్రీ ఇస్తున్న శంకర్ కొడుకు అర్జిత్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..